చండీగఢ్ : వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ విధాన నిబంధనావళి (ఎన్పీఎఫ్ఏఎం) ముసాయిదా.. గతంలో రద్దయిన 3 సాగు చట్టాల కన్నా ప్రమాదకరమైనదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆరోపించింది. దీనిని అమలు చేస్తే, సమాఖ్య హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతాయని తెలిపింది.
వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), రైతులు, కూలీలకు కనీస వేతనాలకు సంబంధించిన నిబంధనలు దీనిలో లేవని, అందువల్ల రైతులు, వ్యవసాయ కూలీలు, చిన్న ఉత్పత్తిదారులు, చిన్న తరహా వ్యాపారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని హెచ్చరించింది.