NEET | నీట్ ఎత్తేయండి.. ప్రధాని మోదీ, 8 మంది సీఎంలకు స్టాలిన్ లేఖ
NEET | వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష (నీట్) విధానాన్ని ఎత్తేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతోపాటు ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు ఆయన లేఖలు రాశారు.
చెన్నై: వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష (నీట్) విధానాన్ని ఎత్తేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతోపాటు ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు ఆయన లేఖలు రాశారు. అలాగే నీట్ (NEET ) నుంచి తమిళనాడును మినహాయించాలని పునరుద్ఘాటించారు. వృత్తిపరమైన కోర్సుల ఎంపిక ప్రక్రియ ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా 12 వ తరగతి మార్కుల ద్వారా మాత్రమే ఉండాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. నీట్ అనేది విద్యార్థులపై అనవసరమైన అదనపు ఒత్తిడి అని ఆరోపించారు.
కాగా, ఇటీవల నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు తమిళనాడు వ్యతిరేకతను సమర్థిస్తున్నదని స్టాలిన్ తెలిపారు. ‘ఈ ఎంపిక ప్రక్రియను తొలగించాల్సిన అవసరంపై ఇతర రాష్ట్రాలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి’ అని ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని, 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్ల కోసం అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించినట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం కోసం ఈ బిల్లును పంపామని, ఇది పెండింగ్‌లో ఉందన్నారు.
మరోవైపు నీట్ రద్దు కోసం అసెంబ్లీలలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాలని ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ సూచించారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పంజాబ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ సీఎంలకు ఈ మేరకు లేఖలు పంపారు. అలాగే నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా స్టాలిన్ లేఖ రాశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

