Puri Jagannath Temple | ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మయూర్భంజ్ (Mayurbhanj) జిల్లాలోని రస్‌గోవింద్‌పూర్ ప్రాంతంలోగల హ్రుదానంద హైస్కూల్‌కు చెందిన 70 మంది విద్యార్థులు క్రిస్మస్ సెలవు సందర్భంగా పూరీ ఆలయ సందర్శనకు వెళ్లారు.
ఆలయానికి 22 మెట్లు ఎక్కుతుండగా బాలికలు తొక్కిసలాటలో చిక్కుకుని స్పృహతప్పి పడిపోయారని ఆలయ అధికారులు తెలిపారు. గాయపడిన బాలికలు 9, 10 తరగతుల విద్యార్థులని,వారిని రక్షించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.