చెన్నై: తమిళనాడులోని విరుధ నగర్లో ఓ బాణసంచా కర్మాగారంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేసి, సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పేలుడుకు కారణాన్ని స్పష్టంగా గుర్తించలేదు. పవర్ లీకేజీ కానీ, పేలుడు పదార్థాల రాపిడి కానీ కారణం కావొచ్చని భావిస్తున్నారు.