న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మంగళవారం ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. 72 ఏండ్ల సీతారాం ఏచూరి శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. దీంతో ఆగస్టు 19న ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు.
ప్రస్తుతం వైద్యుల బృందం ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నదని, ఆయన రెస్పిరేటరీ సపోర్ట్‌తో ఉన్నారని సీపీఎం పేర్కొన్నది. ఇటీవలే ఏచూరి కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. న్యుమోనియా తరహా ఛాతి ఇన్ఫెక్షన్కు చికిత్స కోసమని ఆయనను దవాఖానలో చేర్పించారు. మొదట చికిత్సకు బాగా స్పందించినప్పటికీ క్రమంగా ఆయన ఆరోగ్యం విషమిస్తున్నది.