న్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి(Sitaram Yechury) ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు ఇవాళ సీపీఎం పార్టీ ప్రకటించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో 72 ఏళ్ల ఏచూరికి చికిత్స జరుగుతున్నది. సీతారం ఏచూరికి తీవ్రమైన శ్వాసకోస ఇన్ఫెక్షన్ జరిగిందని, ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు సీపీఎం పార్టీ ప్రకటించింది. తన ఎక్స్ అకౌంట్లో సీపీఎం పార్టీ ఓ పోస్టు పెట్టింది. ఓ డాక్టర్ల బృందం ఏచూరిని ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నదని, అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్రిటికల్‌గా ఉన్నట్లు పార్టీ వెల్లడించింది. ఆగస్టు 19వ తేదీన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. న్యుమోనియా లాంటి ఛాతి ఇన్ఫెక్షన్తో ఏచూరి బాధపడుతున్నారు.
Comrade Sitaram Yechury’s health condition pic.twitter.com/NDPl8HE8K0
— CPI (M) (@cpimspeak) September 10, 2024