సర్, ఈసీ వివక్షపై సీజేఐకి 23 విపక్షాల లేఖ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), ఎన్నికల సంఘం వివక్షాపూరిత వైఖరిపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాంత్‌కు 23 ప్రతిపక్ష పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ ఉమ్మడి లేఖ రాశారు.
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), ఎన్నికల సంఘం వివక్షాపూరిత వైఖరిపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాంత్‌కు 23 ప్రతిపక్ష పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ ఉమ్మడి లేఖ రాశారు. ఇందులో ఇటీవల ఇండియా కూటమితో విభేదించిన డీఎంకే, ఆప్ కూడా భాగస్వాములయ్యాయి. ఈ లేఖను బహిర్గత పర్చకున్నా.. దీనిపై 23 విపక్షాలు, ఇండిపెండెంట్ ఎంపీ కపిల్ సిబల్ సంతకం చేసిన విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ నిర్ధారించారు.
ఈ నాలుగు పేజీల లేఖ న్యాయవ్యవస్థ అంతరాత్మకు విజ్ఞప్తి చేస్తూ సాగింది. ఎందుకంటే ఇతర మార్గాలన్నీ విఫలమైనప్పుడు భారత ప్రజాస్వామ్యం న్యాయవ్యవస్థ వైపే చూస్తుంది. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి, ఎన్నికల ఫలితాల తారుమారు అంశాలను ఎత్తి చూపడంతో పాటు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వివిధ రాష్ర్టాల్లో ఎన్నికల యంత్రాంగం, సర్లను వినియోగించిన ఘటనలను కూడా ఈ లేఖలో ఉదాహరణగా పొందుపరిచినట్టు ప్రతిపక్ష వర్గాలు తెలిపాయి. ఈ లేఖపై డీఎంకే, ఆప్‌లు సంతకాలు చేయడం ఇండియా కూటమికి బలాన్ని ఇచ్చినట్టయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CJI
- ECs
- Opposition parties
- sir
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

