ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 21:31:56

సిక్కింకు ఎంఐ -17వీ5 హెలికాప్టర్

సిక్కింకు ఎంఐ -17వీ5 హెలికాప్టర్

సిక్కింకు ఎంఐ -17వీ5 హెలికాప్టర్ 

సిక్కిం: వరదలతో అతలాకుతలమవుతున్న సిక్కింను ఆదుకునేందుకు తూర్పు ఎయిర్‌ కమాండ్‌ ఓ హెలికాప్టర్‌ను పంపించింది. ఆ రాష్ట్ర సర్కారు అభ్యర్థనమేరకు మంగాన్‌ నుంచి సాక్యాంగ్‌కు 5.5 టన్నుల నిత్యావసర వస్తువులతో కూడిన ఎంఐ -17వీ5 హెలికాప్టర్‌ బయలుదేరింది. ఈ మేరకు కోల్‌కతాలోని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (ప్రో) డిఫెన్స్  ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కొండచరియలు విరిగిపడడం, వరదల కారణంగా మంగన్ జిల్లా నుంచి సాక్యాంగ్‌ ప్రాంతాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో సిక్కిం ప్రభుత్వం తూర్పు ఎయిర్‌ కమాండ్‌ సాయం కోరింది. ఎంఐ -17వీ5 శక్తివంతమైన హెలికాప్టర్. ఇది ఆధునిక ఏవియానిక్స్, గ్లాస్ కాక్‌పిట్ పరికరాలతో కూడి ఉంటుంది. ఇందులో అత్యాధునిక నావిగేషనల్ పరికరాలు, ఏవియానిక్స్, వాతావరణ రాడార్లు ఉన్నాయి.  లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo