చండీఘడ్: పంజాబ్ కాంగ్రెస్ నాయకురాలు, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నవ్‌జోత్ కౌర్ సిద్ధూ సొంత పార్టీకి శనివారం గుడ్‌బై చెప్పారు. ప్రధాని మోదీ పంజాబ్‌లో పర్యటించనున్న వేళ ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. హస్తం పార్టీలో సమర్థులైన నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారని, వ్యక్తిగత లాభాల కోసం పార్టీలో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె ఈ సందర్భంగా ఆరోపణలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్‌ను ఈ సందర్భంగా ఆమె విమర్శించారు. కౌర్ నిష్క్రమణపై ఎంపీ, మాజీ డిప్యూటీ సీఎం రంధావా స్పందిస్తూ ‘మంచిదైపోయింది’ అని ఎక్స్‌లో ఆమె పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు.