బెంగళూరు, జూలై 18: దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థ మెటా ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరణించినట్టు ప్రకటించడం తీవ్ర గందరగోళానికి, విమర్శలకు దారితీసింది.
ప్రముఖ నటి బి సరోజాదేవి మృతికి సంతాపం తెలుపుతూ ముఖ్యమంత్రి కార్యాలయం సంతాప సందేశాన్ని పోస్ట్ చేసింది. అయితే ఈ సందేశాన్ని మెటా ఆటో ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్తప్పుగా అనువదించింది. వివాదం రావడంతో దానికి ఆ సంస్థ క్షమాపణలు తెలిపింది.