బెంగళూరు, ఫిబ్రవరి 24: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, ఇతరుల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న ముడా కుంభకోణంపై లోకాయుక్త దర్యాప్తు నివేదిక కీలక వివరాలను వెల్లడించింది. సిద్ధరామయ్యపై దర్యాప్తును ముగిస్తూ ఈ కేసులో బీ నివేదికను దాఖలు చేయడానికి ముందు లోకాయుక్త సిద్ధరామయ్యకు కేవలం 30 ప్రశ్నలు మాత్రమే సంధించింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసి కుంభకోణంలోని కీలక పాత్రధారులను బయటపెట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును లోకాయుక్త పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.