బాగల్కోట్ : ప్రభుత్వ ప్రాంగణాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహించకూడదంటూ తమిళనాడు ప్రభుత్వం విధించిన ఆంక్షలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సోమవారం ఆదేశించారు.
బాగల్కోట్ జిల్లాలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ ప్రాంగణాలను తన కార్యకలాపాల ప్రచారానికి వినియోగిస్తున్నదని ఆరోపించారు.