న్యూఢిల్లీ: భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా సారథ్యంలోని నలుగురు సభ్యులతో కూడిన బృందం యాక్సియామ్-4 (ఏఎక్స్-4) మిషన్ ద్వారా జూన్ 8న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనం కానుంది. నిజానికి వీరు ఈ నెల 29న వెళ్లాల్సి ఉండగా యాత్రను వాయిదా వేస్తున్నట్టు అంతరిక్షయాన సంస్థ యాక్సియామ్ స్పేస్, నాసా సంయుక్తంగా ప్రకటించాయి.
భారత కాలమానం ప్రకారం జూన్ 8న సాయంత్రం 6:41 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరుగుతుందని పేర్కొన్నాయి. ఫ్లైట్ షెడ్యూల్ను సమీక్షించిన అనంతరం ప్రయోగ తేదీల్లో మార్పులు చేసినట్టు తెలిపాయి.