Shubhanshu Shukla | యాక్సియం-4 మిషన్ ద్వారా అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (International Space Station)కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) మరో మూడు రోజుల్లో భూమికి తిరిగి రానున్నారు. భూమి మీదకు వ్యోమగాముల తిరుగు ప్రయాణం జూలై 14న చేపడుతున్నామని ‘నాసా’ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. భూమికి తిరిగి రావడానికి ముందు శుభాన్షు తోటి వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలో ఫుడ్‌ను ఆస్వాదించారు (Enjoys Feast On Space Station). ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జీరో గ్రావిటీలో వారంతా సరదాగా సమయాన్ని గడిపారు.
మరోవైపు అంతరిక్ష కేంద్రంలో శుభాన్షు పరిశోధనల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. తాజాగా రైతు అవతారమెత్తారు (space farmer). మెంతి (methi), పెసర విత్తనాలు (moong seeds) వేసి పెంచుతున్నారు. చిన్నపాటి గాజు పాత్రల్లో వాటిని పెంచుతున్నారు.జీరో గ్రావిటీ వాతావరణంలో ఈ మొక్కల పెరుగుదల ఎలా ఉంటుందోనన్న దానిపై ఆయన అధ్యయనం చేస్తున్నారు. ఐఎస్ఎస్లోని ప్రత్యేక స్టోరేజీ ఫ్రీజర్‌లో వాటిని ఉంచి అవి మొలకెత్తే విధానాన్ని ఫొటోలు తీశారు. ఈ పరిశోధనలో ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన రవికుమార్ హోసమణి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సుధీర్ సిద్దపురెడ్డి అనే ఇద్దరు శాస్త్రవేత్తలు శుక్లాకు సహకరిస్తున్నారు.
Also Read..
“Shubhanshu Shukla | అంతరిక్షంలో రైతుగా మారిన శుభాన్షు శుక్లా.. మెంతి, పెసర విత్తనాలు పెంచుతూ..”
“Shubhanshu Shukla: ఇస్రో చీఫ్‌తో ఫోన్లో మాట్లాడిన శుభాన్షు శుక్లా”
“ప్రయోగాలతో శుభాంశు బిజీ!.. క్యుపోలా నుంచి భూమి పరిశీలన”