న్యూఢిల్లీ: గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఐఎస్ఎస్లోని క్యుపోలా నుంచి భూమిని పరిశీలించారు. ఈ మిషన్‌లో 9 ప్రయోజనకరమైన రోజులు పూర్తయ్యాయని ఏక్సియమ్ స్పేస్ తెలిపింది. శుక్లా మయోజెనెసిస్ ఇన్వెస్టిగేషన్‌ను డాక్యుమెంట్ చేశారని తెలిపింది. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల కండరాలు క్షీణించే వేగం ఏ విధంగా పెరుగుతుందో ఈ పరిశోధన వెల్లడిస్తుంది.
మరోవైపు స్పేస్ మైక్రో ఆల్గే ప్రయోగం కోసం ఆయన నమూనాలను సేకరించారు. ఈ ఆర్గానిజమ్స్ భవిష్యత్తులో జరిగే మిషన్స్‌కు ఆహారం, ప్రాణవాయువు, జీవ ఇంధనంగా, అంతరిక్ష పరిశోధనల్లో స్థిరమైన లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌గా ఉపయోగపడవచ్చు. శుక్లా గౌరవార్థం కర్ణాటక పోస్టల్ సర్కిల్ ప్రత్యేక కవర్, కార్డులను విడుదల చేసింది.