రాయపోల్ మే 30 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో మే 31 ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. రాయపోల్ విద్యుత్ సబ్ స్టేషన్లో లో – మెయింటెనెన్స్ పనులు ఉండడంతో ఆదివారం కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాకు నిలిపి వేస్తామని మండల విద్యుత్ ఏఈ శ్రీనివాసరావు వెల్లడించారు.
సబ్ స్టేషన్లో లో – మెయింటెనెన్స్ పనుల కారణంగా రాయపోల్, చిన్నమాసాన్ పల్లి, కొత్తపల్లి, తిమ్మక్కపల్లి, చౌదరి పాలెం, టెంకంపేట గ్రామాలకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. కాబట్టి రైతులు, ప్రజలు విద్యుత్ అధికారులకు సహకరించగలరని మండల విద్యుత్ ఏఈ శ్రీనివాసరావు కోరారు.