Kharge | అది సమర్థనీయం కాదు.. అభిషేక్ బెనర్జీపై దాడిని ఖండించిన ఖర్గే
Kharge | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని సోనార్పూర్ (Sonarpur) లో టీఎంసీ ఎంపీ (TMC MP) అభిషేక్ బెనర్జీ (Abhisheik Baerjee) పై ఇవాళ (శనివారం) జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఖండించారు. రాజకీయ భేదాభిప్రాయాలున్నంత మాత్రాన హింసకు దిగడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని తప్పుపట్టారు.
Kharge : పశ్చిమబెంగాల్ (West Bengal) లోని సోనార్పూర్ (Sonarpur) లో టీఎంసీ ఎంపీ (TMC MP) అభిషేక్ బెనర్జీ (Abhisheik Baerjee) పై ఇవాళ (శనివారం) జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఖండించారు. రాజకీయ భేదాభిప్రాయాలున్నంత మాత్రాన హింసకు దిగడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని తప్పుపట్టారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘటనల బాధితులను పరామర్శించేందుకు అభిషేక్ బెనర్జీ శనివారం సోనార్పూర్ వెళ్లారు. ఈ సందర్భంగా కొందరు ఆయనపై కోడి గుడ్లు, రాళ్లతో దాడి చేశారు.
ఈ దాడిని తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఎక్స్ వేదికగా ఖండించారు. ఆయనకు తగినంత పోలీసు భద్రత లేకపోవడాన్ని బట్టి బీజేపీ రాజకీయాలు, ప్రతీకారాలను అర్థం చేసుకోవచ్చని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతిపక్ష నేతల భద్రత కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా అభిషేక్ బెనర్జీపై దాడిని ఖండించారు. తాము ఎంతటి ద్వేషపూరిత రాజకీయాలకైనా దిగగలమని ఈ దాడితో బీజేపీ రుజువు చేసిందని వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీ కార్యకర్తలే అభిషేక్‌పై దాడి చేశారని టీఎంసీ ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

