అయోధ్య: దేశంలోని సీఎంలు, గవర్నర్లు, రాయబారులు వంటి ప్రముఖులకు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ విజ్ఞప్తి చేసింది. రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వచ్చే జనవరి 22న జరుగుతుందని, రాజ్యాంగపరమైన ప్రొటోకాల్స్ ఉన్నవారు, వీఐపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రయత్నించవద్దని కోరింది. అధికారులు, ట్రస్ట్ సిబ్బంది ఈ కార్యక్రమంలో తీరిక లేకుండా సేవలందిస్తూ ఉంటారని, అందువల్ల వీఐపీలకు సేవ చేసేందుకు సమయం ఉండదని వివరించింది.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మితమవుతున్న మసీదుకు ప్రవక్త పేరిట మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు అని పేరు పెట్టాలని ఆలిండియా రబ్తా-ఈ-మసీద్ సంస్థ నిర్ణయించింది. దేశంలోని మసీదులన్నీ ఈ సంస్థలో భాగస్వాములు.