గయా: బీహార్‌లోని గయాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. జైలు నుంచి ఎందుకు ప్రభుత్వాన్ని నడపాలి అని ఆయన ప్రశ్నించారు. జైలు పాలైన పీఎం, సీఎం, మంత్రులెవరైనా.. తమ పదువులు కోల్పోయే రీతిలో ఇటీవల పార్లమెంట్లో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ రాజ్యాంగ సవరణ బిల్లును ఉద్దేశిస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగిని 50 గంటల పాటు జైలులో వేస్తే, అప్పుడు ఆ వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నాడని, అతను డ్రైవర్ అయినా, క్లర్క్ అయినా, ప్యూన్ అయినా .. జాబ్ పోతోందన్నారు. కానీ సీఎం, మంత్రులు.. జైలులోనే ఉంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో కొందరు జైలు నుంచే ఫైళ్లపై సంతకాలు చేసేవారని, జైలు నుంచే ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చేవారన్నారు. ఒకవేళ ప్రజానేతకు అటువంటి వ్యక్తిత్వం ఉంటే, అప్పుడు మనం అవినీతిని ఎలా ఎదుర్కుంటామని ప్రధాని ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వం చట్టాన్ని తయారు చేసిందన్నారు. ఆ చట్ట పరిధిలోకి ప్రధానమంత్రి కూడా వస్తారని మోదీ అన్నారు. ఒకవేళ ఆ చట్టం ఆమోదం పొందితే, అప్పుడు జైలులో ఉన్న ప్రధాని అయినా, సీఎం అయినా.. 31వ రోజు తన పదవిని కోల్పోవాల్సి వస్తుందన్నారు.
#WATCH | PM Narendra Modi says, “… If a government employee is imprisoned for 50 hours, then he loses his job automatically, be it a driver, a clerk or a peon. But a CM, a Minister, or even a PM can enjoy staying in the government even from jail… Some time ago, we saw how… pic.twitter.com/1iY1hXr3Xp
— ANI (@ANI) August 22, 2025
ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద కట్టిన ఇండ్లకు ఇవాళ గృహ ప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గయాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గ్రామీణ పథకం కింద 12 వేల మంది లబ్ధిదారులు, అర్బన్ పథకం కింద 4వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. వారిని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. బీహార్‌ను కీర్తించారు. చాణక్యుడు, చంద్రగుప్తుడు.. ఏలిన ప్రదేశం ఇది అన్నారు. అన్ని సమయాల్లోనూ దేశానికి వెన్నుముకగా బీహార్ నిలిచిందన్నారు. ఇక్కడ తీసుకున్న దీక్షలు ఈ దేశాన్ని బలోపేతం చేశాయన్నారు. వృధా కాలేదన్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో ఉగ్రవాదులను అణిచివేస్తామని ఇక్కడ నుంచే పేర్కొన్నట్లు చెప్పారు. ఆ శపధం తీరిందని, ప్రపంచం కూడా ప్రత్యక్షంగా చూసిందన్నారు.
ఆర్జేడీ పాలన సమయంలో గయాజీ లాంటి పట్టణాలు చీకట్లోకి వెళ్లినట్లు మోదీ ఆరోపించారు. ఎన్నో తరాల ఇక్కడ నుంచి వలస వెళ్లినట్లు చెప్పారు. బీహారీ ప్రజలను ఆర్జేడీ కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాలు, బాధలు, గౌరవమర్యాదల గురించి విపక్షాలు ఆలోచించడం లేదన్నారు. బీహారీ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్డీఏ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోందని, స్థానిక యువత ఇక్కడే తమ పేరెంట్స్‌తో ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.