Shocking Video | కేరళ (Kerala)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న ఆర్టీసీ బస్సులో (Moving Bus) నుంచి ఓ మహిళ ప్రమాదవశాత్తూ కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన త్రిసూర్ (Thrissur) జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
74 ఏళ్ల మహిళ బస్సు ఎక్కింది. ఇంతలో కండక్టర్ ఆమెవైపు వచ్చి సీటు ఖాళీ ఉంది అక్కడ కూర్చోమని చెప్పడం వీడియోలో చూపిస్తోంది. ఇంతలో ఆమె కూర్చునేందుకు వెళ్తుండగా బస్సు కుదుపులకు అదుపుతప్పి డోర్లో నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో బస్సులోని వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కండక్టర్ వెంటనే బస్సును ఆపి మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
கேரளா – திருச்சூர் : ஓடும் பேருந்தில் இருந்து தவறி விழுந்த நளினி(74) என்ற மூதாட்டி மரணம்.
பயணம் செய்யும் போது காலியாக இருந்த இருக்கையைக் கண்டு உட்கார பின்னால் சென்று தவறி கீழே விழுந்தார்.#kerala #Thrissur #Bus #Accident pic.twitter.com/E5DCkOxirF
— Kᴀʙᴇᴇʀ – தக்கலை கபீர் (@Autokabeer) August 12, 2025
Also Read..
Rahul Gandhi | మూగజీవాలైన కుక్కలు పెద్ద సమస్య కాదు.. సుప్రీం ఆదేశాలపై రాహుల్ గాంధీ