Sanjay Raut : గాంధీకి బదులుగా జిన్నాను చంపి ఉంటే… : సామ్నాలో సంజయ్ రౌత్
Sanjay Raut : దేశ విభజనపై శివసేన కొత్త కోణం బయటపెట్టింది. గాంధీకి బదులుగా జిన్నాను గాడ్సే చంపినట్లయితే.. దేశం విభజన జరిగి ఉండేది కాదని మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్...

ముంబై : దేశ విభజనపై శివసేన కొత్త కోణం బయటపెట్టింది. గాంధీకి బదులుగా జిన్నాను గాడ్సే చంపినట్లయితే.. దేశం విభజన జరిగి ఉండేది కాదని మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) దేశ విభజనకు కొత్త భాష్యం చెప్పారు. అంతటితో ఆగకుండా ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిని భారతదేశ విభజన సమయంతో పోల్చారు. ఒక దేశ అస్తిత్వం, సార్వభౌమత్వాన్ని కోల్పోవడం ఎంత బాధాకరమైనదో ఆఫ్ఘాన్ పరిస్థితి గుర్తు చేస్తున్నదని తెలిపారు. శివసేన పత్రిక ‘సామ్నా’లో తన కాలమ్ ‘రోఖ్తోక్’ లో సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు రాశారు.
మహాత్మా గాంధీ స్థానంలో నాథూరామ్ గాడ్సే.. మహ్మద్ అలీ జిన్నాను చంపినట్లయితే.. దేశ విభజన జరగకపోయి ఉండేదని సంజయ్ రౌత్ తెలిపారు. ఒకవేళ అలా జిన్నాను చంపినట్లయితే ఆగస్టు 14 న విభజన స్మారక దినోత్సవాన్ని జరుపుకోవలసిన అవసరం ఉండేది కాదన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆగస్టు 14 న విభజన విభీష్క స్మారక దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు.
విభజన ద్వారా వేరైన భాగాన్ని తిరిగి దేశంలో చేర్చని వరకు ఆ విభజన నొప్పిని ఎలా తగ్గించవచ్చునని ప్రశ్నించారు. అఖండ్ భారతదేశం ఏర్పడాలని మేమూ భావిస్తున్నాం, కానీ అది సాధ్యమయ్యేలా లేదని పేర్కొన్నారు. గాంధీ రాజకీయాల్లో చురుకుగా లేనప్పుడు ముస్లింలను బ్రిటీషర్లు ప్రత్యేక ఓటర్లుగా గుర్తించారని, అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముస్లింలను ప్రత్యేక ఓటర్లుగా గుర్తించేందుకు నెహ్రూ నిరాకరించారని రాశారు.
ఇవి కూడా చదవండి..
నిత్యం ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాల్సిందే..! ఎందుకంటే..?
సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా..? అయితే, వీటిని పరిశీలించండి..
4 నిమిషాల్లో 20,000 కేలరీల బర్గర్ హంఫట్..!
ఇస్లాం పరువు తీస్తున్న తాలిబాన్ : సయ్యద్ జైనుల్ అబెదిన్
మణిపూర్ గవర్నర్గా లా గణేశన్ నియామకం
లాక్డౌన్ను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో ఆందోళనలు
157 ఏండ్ల క్రితం రెడ్ క్రాస్ సంస్థ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

