ముంబై: తమ పార్టీ గీతం నుంచి జై భవానీ, హిందూ పదాలను తొలగించే ప్రసక్తే లేదని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఈ పదాలను తొలగించాలంటూ తనకు ఎన్నికల సంఘం నోటీసులు పంపిందని, ఈసీ ఆజ్ఞలకు కట్టుబడబోమని తెలిపారు.
ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ పదాలను తొలగించడం మహారాష్ట్రకే అవమానం. కొత్త పార్టీ గుర్తు వెలుగుతున్న కాగడాను ప్రచారం చేసేందుకు ఈ గీతాన్ని రూపొందించా’ అని చెప్పారు.