ముంబై: రానున్న లోక్సభ ఎన్నికల కోసం పొత్తుల విషయంలో చర్చలను కాంగ్రెస్ సున్నా నుంచి ప్రారంభించాలని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం ఒక స్థానాన్నైనా గెల్చుకోలేదన్నారు.
మహారాష్ట్రలోని 48 లోక్సభ నియోజకవర్గాల్లో 23 స్థానాలతోపాటు, దాద్రా నగర్ హవేలీ స్థానం నుంచి కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన ఎంపీల్లో అత్యధికులు ప్రస్తుతం షిండే వర్గంలో ఉన్నారని, కూటమిలో అతి పెద్ద పార్టీ కాంగ్రెసేనని చెప్పారు.