శివసేన ఎమ్మెల్యేలు హోటల్‌కు తరలింపు… ఎందుకంటే?
ముంబై: మహారాష్ట్రలోని అధికార పార్టీ శివసేన తన ఎమ్మెల్యేను హోటల్‌కు తరలించింది. సోమవారం రాత్రి రెండు లగ్జరీ బస్సులలో గుర్తు తెలియని రిసార్ట్‌కు తీసుకెళ్లింది. దీనికి ముందు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ నెల 10న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలపై వారితో మాట్లాడారు. బీజేపీ ప్రలోభాలకు గురి కావద్దని శివసేన ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ సమావేశంలో శివసేన ఎమ్మెల్యేలతోపాటు కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.
అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహమైన సహ్యాద్రి గెస్ట్ హౌస్ నుంచి రెండు లగ్జరీ బస్సుల్లో శివసేన, స్వతంత్ర ఎమ్మెల్యేలను ఒక హోటల్‌కు తరలించారు. పశ్చిమ ముంబై ప్రాంతమైన మలాడ్‌లోని హోటల్ రిట్రీట్‌కు ఈ ఎమ్మెల్యేలను తరలించినట్లు తెలుస్తున్నది.
కాగా, మహారాష్ట్రకు చెందిన ఆరు రాజ్యసభ సీట్లకుగాను శివసేన ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. కూటమి ప్రభుత్వంలోని కాంగ్రెస్, ఎన్సీపీ ఒక్కో అభ్యర్థిని నిలబెట్టాయి. అయితే బీజేపీ మాత్రం ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దించింది. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ ట్రాప్‌లో పడకుండా ఉండేందుకు వారిని రహస్యంగా హోటల్‌కు శివసేన తరలించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

