అశ్వారావుపేట రూరల్, ఆగస్టు 5 : సీతారామ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కాలువలు మాకొద్దంటూ రైతులు సర్వే పనులను అడ్డుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెంలో చోటుచేసుకున్నది. వినాయకపురం నుంచి మల్లాయిగూడెం మీదుగా సీతారామ డిస్ట్రిబ్యూటరీ కాలువ తవ్వకాల కోసం అశ్వారావుపేట రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు మల్లాయిగూడెంలో బుధవారం సర్వే పనులు చేపట్టారు.
విష యం తెలుసుకున్న రైతులు సమాచారం ఇ వ్వకుండా ఎలా సర్వే చేస్తారని అడ్డుకున్నా రు. భూమిని ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చె ప్పారు. బలవంతంగా సర్వే చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్ఐ మాట్లాడుతూ రైతుల సమస్య ను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 452 రకాల పక్షులు ఉన్నట్టు వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏడాది ఫిబ్రవ రి, జూలై నెలలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (హెచ్బీపీ),డెకన్ బర్డర్స్ (డీబీ) సంయుక్తంగా పక్షుల సర్వే చేపడుతున్నాయి. తాజాగా జూలైలో 4వ విడత సర్వే నిర్వహించింది. హెచ్‌బీఏ సభ్యుడు శ్రీరామ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పక్షుల సంరక్షణ, వాటి జీవన విధానం, వలసలకు కారణాలు, అంతరించిపోతున్న జాతుల గుర్తింపు, కొన్ని రకాల పక్షులు పెరగడానికి కారణాలు వంటివి విశ్లేషించడమే లక్ష్యంగా సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2025లో ప్రారంభమైన బర్డ్ అట్లాస్ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నాలుగు సార్లు నిర్వహించినట్టు చెప్పారు.