తిరువనంతపురం, మే 24: కేరళలోని కోచి పోర్టుకు సరుకుతో వస్తున్న లైబీరియాకు చెందిన ఒక వాణిజ్య నౌక కేరళలోని అరేబియా సముద్ర జలాల్లో శనివారం ప్రమాదవశాత్తు పక్కకు ఒరిగిపోయింది. కోచీకి నైరుతిగా సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో ఎంఎస్సీ అనే లైబీరియా నౌక ప్రమాదవశాత్తు ఒరిగిపోయింది.
దీంతో అందులోని చమురుతో పాటు కొంత సరుకు సముద్రం పాలైంది. ఆ నౌకలో ఉన్న 24 మంది నావికా సిబ్బందిని కోస్ట్‌గార్డు వారు రక్షించారు. తీర ప్రాంతంలో చమురు తెట్టు కొట్టుకొస్తుందని, దీనిపట్ల అప్రమత్తంగా అధికారులు ప్రజలను హెచ్చరించారు.