పాట్నా: బీహార్‌కు ప్రత్యేక హోదా అవసరం లేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత రేణుదేవి రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం కౌంటర్ ఇచ్చారు. ‘ప్రత్యేక హోదా వలన రాష్ర్టానికి అనేక అభివృద్ధి అవకాశాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక సాయం అందుతాయి. ఇది బీహార్‌కు అత్యవసరం’ అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన రేణుదేవి పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ‘ఎవరైనా ప్రత్యేక హోదా అవసరం లేదని చెబితే, వారికి సమస్యపై అవగాహన లేదని, వారికేం తెలియనట్టు అర్థం’ అని పేర్కొన్నారు. బీహార్ ప్రభుత్వంలో బీజేపీ, జేడీయూ మిత్రపక్షాలుగా ఉన్నాయి.