Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే.. ప్రధాని మోదీ, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ, పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. తాజాగా థరూర్ మరోసారి వార్తల్లో నిలిచారు.
ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహించిన పార్టీ సమావేశానికి థరూర్ డుమ్మా కొట్టారు. లోక్‌సభ శీతాకాల సమావేశాలు వచ్చే వారం ముగియనున్న నేపథ్యంలో పార్టీ పనితీరును సమీక్షించేందుకు, సభలో అనుసరించాల్సిన వూహాలపై చర్చించేందుకు నేడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీలతో (Congress MPs) సమావేశం నిర్వహించారు. ఈ ముఖ్యమైన భేటీకి థరూర్ హాజరు కాలేదు. ప్రస్తుతం తాను కోల్‌కతాలో ఉన్నట్లు థరూర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఇలా పార్టీ కీలక భేటీలకు థరూర్ హాజరు కాకపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. నవంబర్ 30న సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి, నవంబర్ 18న ఖర్గే, రాహుల్ నేతృత్వంలో జరిగిన భేటీకి కూడా ఆయన హాజరు కాలేదు.
Also Read..
Massive Fire | గోవా నైట్‌క్లబ్ విషాదం మరవకముందే.. ఒడిశా బార్లో భారీ అగ్నిప్రమాదం
HIV Cases | బీహార్‌లో హెచ్ఐవీ కలకలం.. ఒక్క జిల్లాలోనే 7,400 మందికి పాజిటివ్.. 400 మంది చిన్నారులే