Karnataka CM | కర్ణాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో నాయకత్వ (Karnataka CM) మార్పు ఊహాగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ ఊహాగానాల వేళ విందు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలే సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ ఒకరింటికి ఒకరు వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) డిన్నర్ పార్టీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
బేలాలో పార్టీ నేత ప్రవీణ్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో గురువారం రాత్రి జరిగిన ఈ విందు భేటీలో దాదాపు 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs), పలువురు మంత్రులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరామ్ హెబ్బర్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. అంతకుముందు సీఎం సిద్ధరామయ్య కూడా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతో డిన్నర్ చేయడం గమనార్హం. వారికి బెళగావి నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఆతిథ్యం ఇచ్చారు. ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాల వేళ సీఎం, డిప్యూటీ సీఎం ఇలా వేర్వేరు డిన్నర్ మీట్లు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
Also Read..
Massive Fire | గోవా నైట్‌క్లబ్ విషాదం మరవకముందే.. ఒడిశా బార్లో భారీ అగ్నిప్రమాదం
HIV Cases | బీహార్‌లో హెచ్ఐవీ కలకలం.. ఒక్క జిల్లాలోనే 7,400 మందికి పాజిటివ్.. 400 మంది చిన్నారులే
IndiGo | ఇండిగో సంక్షోభం.. నలుగురు అధికారులపై డీజీసీఏ వేటు