ముంబై : కర్నాటకలో కాంగ్రెస్ విజయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్ధితులు బీజేపీకి అనుకూలంగా లేవని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఆప్ నేత సంజయ్ సింగ్ అరెస్ట్ రాజకీయ కక్షసాధింపు చర్యేనని పవార్ పేర్కొన్నారు.
ఆప్ నేతపై ఈడీ తీసుకున్న చర్యతో ఆప్, కాంగ్రెస్ను ఏకం చేస్తాయని విపక్ష ఇండియా కూటమి బలోపేతం గురించి చెబుతూ శరద్ పవార్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏడు లోక్సభ స్ధానాలకు గాను మూడు స్ధానాలను కాంగ్రెస్కు కేటాయించేందుకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విపక్ష కూటమిలో లుకలుకలు లేవని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలకని రాజకీయ నేతలను టార్గెట్ చేసేందుకు దర్యాప్తు సంస్ధలను ప్రయోగిస్తున్నాయని పవార్ ఆరోపించారు.
కాగా, అజిత్ పవార్ బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడంతో పార్టీలో చీలిక ఏర్పడటంపై ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే స్పందించారు. పార్టీలో చీలిక తమ కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆమె పేర్కొన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలు వేర్వేరుగా ఉంటాయని సుప్రియా సూలే వ్యాఖ్యానించారు.
Read More :
Maharashtra Hospitals | మరో 2 ఆసుపత్రుల్లోనూ అదే పరిస్థితి.. 24 గంటల్లో 23 మరణాలు