ముంబై, జూన్ 4: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశంలో రాజకీయ మార్పులకు అనుకూలంగా ఉన్నాయని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తెలిపారు. ముంబైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో, లేదో కచ్చితంగా తెలియదని చెప్పారు. కేంద్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేని నేపథ్యంలో చంద్రబాబు, నితీశ్ కుమార్తో తాను మాట్లాడినట్టు వస్తున్న వార్తలు అవాస్తమని ఆయన పేర్కొన్నారు. తర్వాతి దేశ ప్రధాని ఎవరని విలేకర్లు ప్రశ్నించగా.. దాని గురించి ఇంకా తాము ఆలోచించలేదని ఆయన సమాధానమిచ్చారు.