ముంబై: అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన 10-15 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని శరద్‌పవార్ వర్గం సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజా ఎన్నికల్లో అజిత్ వర్గం కేవలం ఒక్కస్థానంలోనే గెలవడం, మరికొద్ది నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేపింది.
ఎన్సీపీ (శరద్ పవార్) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘కొంతమంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. 10న పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ముందు 9న నిర్వహించే సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చిస్తాం’ అని ఏ పార్టీ పేరును ప్రస్తావించకుండా తెలిపారు. అయితే ఇవన్నీ వదంతులని అజిత్ వర్గం కొట్టిపారేసింది.