Sharad Pawar | మహారాష్ట్ర సీనియర్ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మహా వికాస్ అఘాడీ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి ఉంటుందా? లేదా? అనేది తెలియదన్నారు. ఆయన వ్యాఖ్యలో మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. దాంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), శివసేన (ఉద్ధవ్ వర్గం), కాంగ్రెస్ కూటమి భవిష్యత్‌పై ప్రమాదంలో పడ్డట్లయ్యింది. శరద్ పవార్ అమరావతిలో మాట్లాడుతూ నేడు ఎంవీఏ కూటమి భాగస్వామ్యం అయ్యామని, తాము కలిసి పని చేయాలనుకుంటున్నామన్నారు.
కానీ, తన కోరికతో ఏం జరుగుతుందన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయని, అయితే, కూటమి కొనసాగుతుందా? లేదా? అన్నదానిపై చర్చ జరుగలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహా వికాస్ అఘాడీ కూటమి కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందా? మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పుడు స్పష్టంగా చెప్పలేమని సమాధానమిచ్చారు. సీట్ల పంపకం దగ్గర్నుంచి అనేక సమస్యలున్నాయని, ఏ విషయంపై ఇంకా చర్చించలేదన్నారు. పార్టీలకు వారి సొంత సబ్జెక్టులుంటాయన్నారు. కాబట్టి 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ పార్టీలు కలిసి పోరాడతాయా? లేదా? అని మనం ఇప్పుడే ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.
2024లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ), శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మూడు పార్టీలు కలిసి పోరాడాలని భావిస్తున్నానన్నారు. అయితే, ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్ల మార్పుపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం చివరి క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై అడిగిన ప్రశ్నకు, ఎంవీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో ఈ అంశాన్ని చేర్చలేదని, నిర్ణయం తర్వాత మాత్రమే ఈ విషయం గురించి తనకు తెలిసిందని పవార్ పేర్కొన్నారు. మహా వికాస్ అఘాది గురించి ప్రజలతో పాటు, తమ నాయకులు కూడా ఈ పొత్తు ఎంత వరకు వెళ్తుందో తెలియక గందరగోళంలో ఉన్నారని చెప్పారు.