లక్నో: భారీగా కురుస్తున్న వర్షాల వల్ల పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో శ్మశానవాటికలోని సమాధుల నుంచి మృతదేహాలు కొట్టుకుపోయాయి. గమనించిన స్థానికులు పోలీసుల సహాయంతో ఆ మృతదేహాలను వెలికితీశారు. మతపరమైన లాంఛనాలతో తిరిగి ఖననం చేశారు. (bodies washed out of graves) ఉత్తరప్రదేశ్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కాగా, సహారన్పూర్ జిల్లాలోని రహదారి పక్కన ఉన్న శ్మశానవాటికను వరద నీరు ముంచెత్తింది. దీంతో నీటి ప్రవాహానికి పలు సమాధులపై ఉన్న మట్టి కోతకు గురైంది. ఈ నేపథ్యంలో ఖననం చేసిన పలు మృతదేహాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు ఇది తెలుసుకుని గ్రామస్తులు ఆందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కొట్టుకుపోయిన మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. పోలీసులు, సంఘ సభ్యుల సమక్షంలో శ్మశానవాటికలోని సురక్షితమైన, ఎత్తైన ప్రదేశంలో మతపరమైన లాంఛనాలతో గౌరవప్రదంగా తిరిగి ఖననం చేశారు.
అయితే భూ ఆక్రమణల వల్ల వర్షం నీరు, నదీ ప్రవాహం వెళ్లే సహజ కాలువలు అడ్డుపడ్డాయని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో భారీ వర్షాల సమయంలో గ్రామాలతో పాటు శ్మశానవాటికలు మునగడంతో ఇలాంటివి జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానవాటికను రక్షించడానికి నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచాలని, హిండన్ నది, సమీపంలోని కాలువలను వెడల్పు చేసే శాశ్వత చర్యలు అమలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
इतनी बारिश कि कब्र से मुर्दे आ गए बाहर!
सहारनपुर में भारी बारिश के चलते गागालेहड़ी क्षेत्र के गांव सय्यद माजारा में कब्रिस्तान में पानी भर गया. पानी इतना भरा कि कब्र में दफ़्न लाशें भी बाहर आ गईं.#saharanpur #uppolice pic.twitter.com/NigTA4QWUC
— zingabad (@zingabad) July 10, 2026