షిండే వర్గంతో టచ్లో ఏడుగురు ఉద్ధవ్ గ్రూప్ ఎంపీలు?
మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. శివసేన (యూబీటీ) పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోకి మారేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం.
ముంబై: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. శివసేన (యూబీటీ) పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోకి మారేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం. జూన్ 7న న్యూఢిల్లీలో ఏకనాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన పలువురు ఎంపీల మధ్య రహస్య సమావేశం జరిగిందని సమాచారం. ఇది ‘యూబీటీ’ వర్గంలో మరో చీలిక రాబోతున్నదనే ఊహాగానాలను బలపరిచేలా ఉందంటున్నారు.
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగవచ్చనే ప్రచారం నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఠాక్రే వర్గానికి చెందిన ఒక ఎంపీకి కేంద్ర మంత్రి మండలిలో చోటు కల్పిస్తామని ప్రతిపాదించగా, మిగిలిన వారికి కీలకమైన సంస్థాగత, రాజకీయ బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

