జైపూర్, అక్టోబర్ 10: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో కేంద్ర మంత్రులను, ఎంపీలను బీజేపీ బరిలోకి దింపుతున్నది. రాజస్థాన్లో అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ప్రకటించింది. 41 మందితో కూడిన లిస్టులో ఏడుగురు ఎంపీలు ఉన్నారు. మాజీ సీఎం వసుంధర రాజే విధేయులకు ఇందులో చోటు దక్కలేదు. ఆగస్టులో బీజేపీ ప్రకటించిన రెండు ముఖ్యమైన కమిటీలలో కూడా వసుంధర రాజే, ఆమె విధేయులకు స్థానం కల్పించకుండా అధిష్ఠానం పెద్ద షాక్ ఇచ్చింది.