Massive Fire | తమిళనాడు (Tamil Nadu)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. దిండిగల్ (Dindigul) జిల్లా గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఆసుపత్రిలో చిక్కుకుపోయిన రోగులను రక్షించి ఇతర ఆసుపత్రులకు తరలించారు. పొగ కారణంగా స్పృహ కోల్పోయిన కొందరు సిబ్బందిని సైతం రక్షించి చికిత్స నిమిత్తం వేరే ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఓ బాలుడు కూడా ఉన్నట్లు తెలిసింది. మెడికల్ ఫెసిలిటీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
7 feared dead after fire broke out at a private hospital in Dindigul district of Tamil Nadu. pic.twitter.com/y3TE7OQGSY
— Pinky Rajpurohit 🇮🇳 (@Madrassan_Pinky) December 12, 2024
Also Read..
Encounter | ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి