ముంబై, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలికి తెలిపిన వివరాల ప్రకారం, నిరుడు రాష్ట్రంలో 2,706 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే, రోజుకు సగటున ఏడుగురు రైతులు బలైపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డిపార్ట్మెంట్ ఈ వివరాలను శాసన మండలికి లిఖిత పూర్వకంగా సమర్పించింది. గత ఏడాదిలో అమరావతి డివిజన్లో 1,069 మంది, ఛత్రపతి శంభాజీనగర్ డివిజన్లో 952 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని రైతు నేత రవికాంత్ తుపర్ విమర్శించారు.