న్యూఢిల్లీ: ప్రధాని మోదీ విద్యార్హతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై జారీ అయిన సమన్లను కొట్టేయాలన్న ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. అయితే అన్ని వివాదాలను కోర్టు విచారణ చేయవచ్చని, కేసు మెరిట్స్‌పై తాము ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించడం లేదని ధర్మాసనం పేర్కొంది. కేజ్రీవాల్ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ అన్ని వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవైతే మోదీ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేయాలి కానీ గుజరాత్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కాదన్నారు.