న్యూఢిల్లీ: ఐదు రాష్ర్టాలు, యూటీలలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను పొడిగించారు. ప్రస్తుతం గోవా, లక్షద్వీప్, రాజస్థాన్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ల్లో జరుగుతున్న సర్‌ను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్టు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. ఈ పొడిగింపుతో ఓటర్లు తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఈ నెల 19 వరకు దాఖలు చేసుకోవచ్చు. సర్ జరుగుతున్న రాష్ర్టాలు, యూటీల సీఈవోల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువు పొడిగించారు.