భోపాల్: ఫార్మా కంపెనీల నుంచి బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.945 కోట్ల విరాళాలు లభించాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ శనివారం వెల్లడించారు. హానికారక కోల్డ్రిఫ్ దగ్గు మందు కారణంగా 26 మంది పిల్లలు మధ్యప్రదేశ్లో మరణించిన ఘటనపై ఆయన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు.
బీజేపీకి ఎన్నికల విరాళాలు ఇచ్చినందు వల్లే ఫార్మా కంపెనీలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎన్నికల నిధులు సమకూర్చినందు వల్లే విషపూరితమైన ఔషధాలను విక్రయిస్తున్న ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం నుంచి రక్షణ లభిస్తోందని ఆరోపించారు. బీజేపీకి విరాళాలు ఇచ్చిన ఫార్మా కంపెనీలలో 35 కంపెనీలు ఔషధాల ప్రమాణాలు పాటించడంలో విఫలమయ్యాయని ఆయన చెప్పారు.