బెల్గావి: కర్నాటక(Karnataka)లోని బెల్గావి జిల్లాకు చెందిన ఓ మఠాధిపతిని పోలీసులు అరెస్టు చేశారు. 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు బుక్ చేశారు. బగల్కోట్ మహిళా పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయ్యింది. ఆ మఠాధిపతిని ముదలాగి పోలీసు స్టేషన్‌కు తరలించారు. బెల్గావి జిల్లాలోని రాయబాగ్ తాలూకాలో ఉన్న ఓ గ్రామంలో మఠం ఉన్నది. ఆ మఠానికి ముఖ్య పూజారిగా ఆయన ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. పలు మార్లు ఆ అమ్మాయిని అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ విషయాన్ని బయటకు చెబితే.. చంపేస్తానని బెదిరించాడు. మే 13వ తేదీన బాధిత బాలికను రాయచూర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ రెండు రోజులు హోటల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని బగల్కోట్కు తీసుకెళ్లి మరో రెండు రోజులు ఉన్నాడు. ఇంటి వద్ద దించేందుకు అమ్మాయిని తీసుకెళ్తున్నట్లు చెప్పిన ఆ పూజారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
మే 17వ తేదీన బాధిత మైనర్ అమ్మాయిని మహాలింగపుర బసు స్టాప్ వద వదిలివళ్లాడు. తనకు జరిగిన అన్యాయం గురించి ఆ అమ్మాయి పేరెంట్స్‌కు చెప్పింది. దాంతో బగల్కోట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి పేరెంట్స్ తరుచూ మఠాన్ని విజిట్ చేసేవాళ్లు. పూజారిపై ఉన్న గౌరవంతో కూతుర్ని అక్కడ వదలివెళ్లేవాళ్లు కూడా. కానీ దీన్ని అదునుగా తీసుకున్న ఆ పూజారి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 2021లో స్థానిక గ్రామస్తులు ఆ పూజారిని కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. నిందిత పూజారి పట్ల చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. కోర్టులో ప్రవేశి పెట్టిన తర్వాత ఆ పూజారిని జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.