Mahayuti | మహారాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) నేతృత్వంలోని మహాయుతి (Mahayuti) కూటమిలో చీలికలు వస్తున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కూటమిలోని ప్రధాన పార్టీ అయిన షిండే వర్గానికి బీజేపీకి మధ్య విభేదాలు తలెత్తినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర హోంశాఖ తీసుకున్న తాజా నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనకు చెందిన కొందరు ఎమ్మెల్యేలకు వీఐపీ భద్రతను ప్రభుత్వం తొలగించింది. ప్రస్తుతం హోంశాఖ సీఎం ఫడ్నవీస్ వద్దే ఉంది. ఈ నేపథ్యంలో షిండే వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు (Shiv Sena MLAs) ఉన్న వై కేటగిరి (Y category security) సెక్యూరిటీని హోంశాఖ ఉపసంహరించుకుంది. బీజేపీ, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కల్పించిన భద్రతను కూడా తగ్గించింది. అయితే, షిండే వర్గంతో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువ అని తెలిసింది. రాష్ట్ర వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.
Also Read..
Maha Kumbh | ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న ‘మహా’రద్దీ.. 37 రోజుల్లో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు
Rahul Gandhi: చీఫ్ ఎన్నికల కమీషనర్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ లేఖ
Tesla | మోదీ-మస్క్ భేటీతో కీలక పరిణామం.. భారత్‌లో నియామకాలు చేపట్టిన టెస్లా