Rahul Gandhi: చీఫ్ ఎన్నికల కమీషనర్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ లేఖ
Rahul Gandhi: సీఈసీ నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం ఉల్లంఘించినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. కొత్త సీఈసీగా జ్ఞానేశ్వర్ కుమార్‌ను నియమించడాన్ని రాహుల్ వ్యతిరేకించారు.
న్యూఢిల్లీ: కొత్త చీఫ్ ఎన్నికల కమీషనర్‌గా జ్ఞానేశ్వర్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తప్పుపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర సర్కారు తుంగలో తొక్కినట్లు ఆరోపించారు. సీఈసీ ఎంపిక ప్రక్రియలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలని, కానీ చీఫ్ జస్టిస్ లేకుండానే హడావుడిగా సీఈసీ పేరును ప్రకటించినట్లు రాహుల్ విమర్శించారు. ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ప్రక్రియలో అమర్యాదపూర్వకంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. సీఈసీ నియమాక ప్రక్రియపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు.
నియామక ప్యానల్ నుంచి సీజేఐని తొలగించడం వల్ల కోట్లాది మంది ఓటర్ల ఆందోళనలను మరింత ఆందోళనకరంగా మార్చినట్లు రాహుల్ ఆరోపించారు. 1949లో ఎన్నికల సంఘం ఏర్పాటు విషయంలో చేసిన వార్నింగ్‌ను కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టిందన్నారు. అంబేద్కర్ ఆశయాలను కాపాడడం ప్రతిపక్ష నేతగా తన బాధ్యత అని, ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు.
During the meeting of the committee to select the next Election Commissioner, I presented a dissent note to the PM and HM, that stated: The most fundamental aspect of an independent Election Commission free from executive interference is the process of choosing the Election… pic.twitter.com/JeL9WSfq3X
— Rahul Gandhi (@RahulGandhi) February 18, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

