Congress Collusion | రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కు : బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ
Congress Collusion | రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మకైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
నల్గొండ : రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మకైందని ( Congress Collusion ) బీఆర్ఎస్ నాయకులు ( BRS leaders ) ఆరోపించారు. భువనగిరి మండలం అనాజీపూర్ నందనం నాగిరెడ్డి పల్లి గ్రామంలో బీఆర్ఎస్ ( BRS ) మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు , రాష్ట్ర సర్పంచ్ పోరం వర్కింగ్ ప్రెసిడెంట్ జక్క రాఘవేందర్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి మండలం లో ప్రతి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే( MLA) కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించినా గాని 20 రోజులుగా వడ్లను కొనుగోలు చేస్తాలేరని ఆరోపించారు. రైస్ మిల్లర్లతో కుమ్ముకై దళారీ వ్యవస్థకు కొమ్ముకాస్తుందని అన్నారు. కరెంట్ సరిగా లేక పంట పొలాలు ఎండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం దళారులకు రూ. 1800 నుంచి 1900 లకే కొనుగోలు చేస్తున్నారని వివరించారు. ఇంతవరకు కల్లాలకు భార్ధన్ గోనె సంచులను పంపించలేదని ఆరోపించారు. వెంటనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీఎంపీపీ కేశవపట్నం రమేష్, మాజీ సింగల్ విండో చైర్మన్ బల్గురి మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గోద శ్రీనివాస్ గౌడ్, మదర్ డైరీ డైరక్టర్ కస్తూరి పాండు, నందనం సర్పంచ్ నాగేల్లి గిరిజ రమేష్ గౌడ్, బీఆర్ఎస్ యువ నాయకులు మట్ట దానంజయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్, బాత్క అశోక్ యాదవ్, బోల్లేపల్లి మాణిక్యం ,ఎలిమినేటి విఠల్ రెడ్డి, చింతల దేవేందర్ గౌడ్, బోల్లేపల్లి అశోక్, ఎదునూరి చంద్రయ్య ,మొలుగు నాగరాజు, మట్ట బాలకిష్ణ గౌడ్, రైతులు ఎలిమినేటి మధుసూదన్ రెడ్డి రెడ్డి, మల్లారెడ్డి , రవీందర్ రెడ్డి, నోముల వెంకట్ రెడ్డి,రైతులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Collusion | రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కు : బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ
Shigella infections | కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి.. 75 కేసులు నమోదు
AP Group-2 | 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్.. డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి
Sonia Gandhi | సీరియల్ కిల్లర్ శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లా : సోనియాగాంధీ
RS Praveenkumar | ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టాలని చూస్తున్న గ్రీన్ SM కంపెనీ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

