Shigella infections | కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి.. 75 కేసులు నమోదు
Shigella infections | కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్లు వ్యాప్తిస్తున్నాయి. మలప్పురం జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఇప్పటి వరకు 75 షిగెల్లా కేసులు నమోదయ్యాయని కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది.
తిరువనంతపురం: కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్లు వ్యాప్తిస్తున్నాయి. మలప్పురం జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అరీకోడ్, పుల్పట్ట, ఎడవన్న ప్రాంతాల్లో తాజాగా షిగెల్లా ఇన్ఫెక్షన్లు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో ఇప్పటి వరకు 75 షిగెల్లా కేసులు నమోదయ్యాయని కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిలో ఎనిమిది కేసులు వ్యాధి సోకిన వ్యక్తుల ద్వారా వ్యాపించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి నివారణ చర్యలను ముమ్మరం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా, షిగెల్లా అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. కలుషితమైన నీరు, నిల్వ ఉన్న లేదా సరిగ్గా ఉడకని ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుంది. విరేచనాల వ్యాధికి కారణమవుతుంది. ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. వ్యాధి సోకిన ఒకటి లేదా రెండు రోజుల్లో విరేచనాలు, మలంలో రక్తం, చీము, తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం, వాంతులు, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మరోవైపు ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ ఈ వ్యాధి సోకిన పిల్లలు కూడా మలం ద్వారా ఈ బ్యాక్టీరియాను వ్యాప్తి చేసే అవకాశమున్నది. చికిత్సలో ఆలస్యం వల్ల మెదడు, మూత్రపిండాలను ప్రభావితం చేసే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. వ్యాధి తీవ్రమైన సందర్భాల్లో మరణానికి కూడా దారితీస్తుందని వైద్యాధికారి హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cases
- Keralam
- Malappuram
- Reported
RELATED ARTICLES
తాజా వార్తలు
Shigella infections | కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి.. 75 కేసులు నమోదు
AP Group-2 | 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్.. డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి
Sonia Gandhi | సీరియల్ కిల్లర్ శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లా : సోనియాగాంధీ
RS Praveenkumar | ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టాలని చూస్తున్న గ్రీన్ SM కంపెనీ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ACB raids | ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై ఇంటిపై ఏసీబీ దాడులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

