Maha Kumbh | ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న ‘మహా’రద్దీ.. 37 రోజుల్లో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు
Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మేళా మరో ఎనిమిది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు తాకిడి పెరిగింది. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకూ 69 లక్షల మంది నదీ స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ డేటా ప్రకారం.. మొత్తంగా 37 రోజుల్లో 55.31 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేశారు.
కాగా, వారాంతం తర్వాత రద్దీ తగ్గుతుందని అంతా భావించారు.. అయితే, సోమవారం ఒక్కరోజే ఏకంగా కోటి మందికి పైగా భక్తులు మహా కుంభమేళాకు వచ్చారు. దీంతో సోమవారం రాత్రి మహా కుంభ్ సమీప ప్రాంతాలైన నైని నయా వంతెన, ఫాఫమౌలో 10-12 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా 8 నుంచి 10 కి.మీ దూరానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం కూడా కుంభ్‌మేళాలో రద్దీ కొనసాగింది. సంగం వెళ్లే రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు రద్దీ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.
పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి రోజున ముగియనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ఇప్పటి వరకూ 55 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్ ముందుగా అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఈ మహాకుంభమేళాను మరో రెండు రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Tesla | మోదీ-మస్క్ భేటీతో కీలక పరిణామం.. భారత్‌లో నియామకాలు చేపట్టిన టెస్లా
Rahul Gandhi: చీఫ్ ఎన్నికల కమీషనర్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ లేఖ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

