న్యూఢిల్లీ : పాకిస్థాన్‌తో సరిహద్దు గల జిల్లాల్లో ఈ నెల 31న సాయంత్రం భద్రతా దళాలు సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహిస్తాయి. గుజరాత్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్ముకశ్మీరులలో ఈ కవాతులు జరుగుతాయి. సరిహద్దుల ఆవలి నుంచి ఎదురయ్యే ముప్పు గురించి ఈ ప్రాంతాలవారికి అవగాహన కల్పించడంతోపాటు, సన్నద్ధతను పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.
ఈ డ్రిల్స్‌ను గురువారం నిర్వహించనున్నట్లు మొదట ప్రకటించారు. కానీ పరిపాలనపరమైన కారణాల వల్ల వాయిదా వేశారు. పాకిస్థాన్‌వైపు నుంచి నాలుగు రోజులపాటు పెద్ద ఎత్తున ఘర్షణ ఎదురైన నేపథ్యంలో, ‘ఆపరేషన్ షీల్డ్’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు.