నేటి నుంచి మలి విడత బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. నేటి అజెండా ప్రకారం, స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభ వ్యవహారాల్లో లిస్ట్ చేసిన ఏకైక అంశంగా ఉంది.
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ
- రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు ట్రంప్ అనుమతిపై ప్రశ్నించనున్న విపక్షాలు
- పశ్చిమాసియా యుద్ధంపైనా చర్చ
న్యూఢిల్లీ, మార్చి 8: పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. నేటి అజెండా ప్రకారం, స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభ వ్యవహారాల్లో లిస్ట్ చేసిన ఏకైక అంశంగా ఉంది. దీంతో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ రెండూ విప్ జారీచేశాయి. టీఎంసీ కూడా బిర్లాకు వ్యతిరేకంగా తీర్మానానికి మద్దతు తెలుపుతున్నది. దీంతో బడ్జెట్ సమావేశాల రెండవ భాగం.. వాడీవేడిగా జరిగేందుకు రంగం సిద్ధమైంది. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంతో పాటు, ఇరాన్‌పై యుద్ధం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ధరల పెరుగుదలకు దారితీసే అంశాలు, రష్యా నుంచి చమురు కొనుగోలుకు ట్రంప్ ‘అనుమతి’.. తదితర అంశాలు చర్చకు రానున్నాయి. మోదీ సర్కార్ వైఖరిని ప్రశ్నించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. టీఎంసీ సభ్యులు సభలో ‘సర్’ అంశాన్ని లేవనెత్తితే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటోకాల్ ఉల్లంఘన అంశాన్ని బీజేపీ లేవనెత్తవచ్చు. బడ్జెట్ సమావేశాల్లో సమయం మిగిలితే విద్యుత్తు సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

