చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విపక్ష ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. ఏఐఏడీఎంకే 178 స్థానాల్లో, బీజేపీ 27 సీట్లలో పోటీ చేయనున్నాయి. పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 నియోజకవర్గాలను కేటాయించారు.
ఈ సందర్భంగా సోమవారం ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి మాట్లాడుతూ సీట్ల పంపకం చర్చలు సజావుగా సాగాయని, అధికారికంగా ఏయే పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో నిర్ణయించామని తెలిపారు. తమ కూటమిలో ఇతర పార్టీలకు ఇవ్వాల్సిన స్థానాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయన్నారు.